: అవును పొరపాటే.. కరసేవకులపై కాల్పుల ఆదేశంపై చింతించిన ములాయం

27 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత సమాజ్‌వాదీ చీఫ్ ములాయం‌ సింగ్ యాదవ్ తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 1991లో కరసేవకులపై కాల్పులకు ఆదేశాలివ్వడం తప్పేనని ఒప్పుకున్నారు. దేశ సమైక్యత కోసం ఆ పనిచేయక తప్పలేదన్నారు. ‘‘ఆ ఆదేశాలివ్వడం తప్పే’’ అని అంగీకరించారు. అయోధ్యలో కరసేవకులను అదుపు చేసేందుకు అప్పట్లో ముఖ్యమంత్రింగా ఉన్న ములాయం కాల్పులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు. మరెందరో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ‘‘కర సేవలకులపై కాల్పులకు ఆదేశాలివ్వడం పొరపాటే. ముస్లింలను కాపాడేందుకు మరోమార్గం లేక అలా చేయాల్సి వచ్చింది. నిజానికి దేశంలోని మైనారిటీలు, ముస్లింల విశ్వాసం పొందేందుకు ఇది ఉపకరిస్తుందనుకున్నా’’ అని ములాయం పేర్కొన్నారు. అయితే కాల్పుల అనంతరం దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

More Telugu News