: నిరుపేదల సంక్షేమంపై దృష్టిసారించండి.. బీజేపీ సీఎంలకు మోదీ ఉద్బోధ

నిరుపేదల సంక్షేమంపై దృష్టి సారించి వారి మనసులు గెలుచుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ పలు విషయాలపై ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. ‘గరీబ్ కళ్యాణ్’(పేదల సంక్షేమం)పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పేదల కోసం ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలు నూటికి నూరుశాతం వారికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పేదల సంక్షేమం, అభివృద్ధిని సీఎంలు ఓ మిషన్‌ మోడ్‌లా చేపట్టాలని పిలుపునిచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు అందించే ఎల్పీజీ, మహిళా సాధికారత, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం, ఎల్‌ఈడీ బల్బుల సరఫరా తదితర అంశాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు ముఖ్యమంత్రులు మాట్లాడారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ సీఎంలతో సమావేశం నిర్వహించడం ఇదే ప్రథమం.

More Telugu News