: బెదిరింపుల‌తో ప్ర‌భుత్వాలు న‌డ‌వ‌వు: బీజేపీ నేత కిష‌న్‌రెడ్డి

తెలంగాణ అధికార‌ టీఆర్ఎస్ పార్టీపై భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర నాయ‌కుడు, ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. హైదరాబాద్‌లోని బీజేపీ శాస‌న‌స‌భ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేయాల్సిన బాధ్య‌త స్పీక‌ర్‌పై ఉంద‌ని అన్నారు. పార్టీ మారిన‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎంగా ప్ర‌మాణం చేస్తున్న‌ప్పుడు రాజ్యాంగాన్ని గౌర‌విస్తాన‌ని కేసీఆర్ హామీ ఇచ్చారని కిష‌న్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగంలో పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం ఉంద‌ని, దాన్ని ఉల్లంఘించొద్ద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. చ‌ట్టాల‌ను మ‌న‌మే అతిక్ర‌మించ‌డం స‌రికాదని కిష‌న్‌రెడ్డి పేర్కొన్నారు. ప్ర‌భుత్వం బెదిరించే ధోర‌ణుల‌కు దిగుతోందని, బెదిరింపుల‌తో ప్ర‌భుత్వాలు న‌డ‌వ‌వ‌ని అన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని అన్నారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించాల‌ని ఆయ‌న సూచించారు. రాష్ట్ర ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

More Telugu News