: స్కూలు గోడలోంచి బయటపడిన 1942 నాటి లాకర్!

వరంగల్‌ జిల్లాలో గోడను పగులగొడితే పురాతన లాకర్‌ బయటపడింది. హన్మకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం పక్కన ఉన్న సుబేదారి ఉన్నత పాఠశాలలో పాతకాలపు నాటి గోడలను కూల్చి వేస్తుండగా అందులో నుంచి పురాతనమైన లాకర్‌ లభ్యమైంది. దీంతో ప్రధానోపాధ్యాయుడు ఇజ్రాయిల్‌ డీఈవోకు, ఎమ్మార్వోకు సమాచారం అందించారు. మూడు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో మందంగా ఉన్న ఈ లాకర్‌ ను 1942లో ఆల్విన్‌ కంపెనీ తయారుచేసినట్టు అధికారులు గుర్తించారు. గతంలో లంకెబిందెలు, లాకర్లు బయపడిన సందర్భాల్లో నిధులు లభించేవన్న కథలు ప్రచారంలో ఉండడంతో...ఈ లాకర్‌ లో ఏముందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More Telugu News