: అభయ గోల్డ్ మోసం రూ.230 కోట్లు!... చార్జిషీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ!

అతి తక్కువ కాలంలో రెట్టింపు రాబడులిస్తామంటూ జనాన్ని నిండా ముంచేసిన అభయ గోల్డ్ అక్రమాల గుట్టును ఏపీ సీఐడీ అధికారులు నిగ్గు తేల్చారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలు సహా మరికొన్ని ప్రాంతాల్లో అభయ గోల్డ్ యాజమాన్యం పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించింది. మెచ్యూరిటీ తీరిన డిపాజిట్లకు సొమ్ము చెల్లించే విషయంలో సంస్థ యాజమాన్యం విఫలమైంది. ఈ నేపథ్యంలో డిపాజిటర్ల ఫిర్యాదుతో అభయ గోల్డ్ పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుపై దృష్టి సారించిన ఏపీ సర్కారు... దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అభయ గోల్డ్ నిర్వాహకులకు హైకోర్టు బెయిలిచ్చింది. అయితే కాస్తంత ఆలస్యంగానైనా సీఐడీ కీలక అడుగు వేసింది. అభయ గోల్డ్ పేరిట రంగంలోకి దిగిన ఈ సంస్థ జనం నుంచి రూ.230 కోట్ల మేర డిపాజిట్లను సేకకరించిందని సీఐడీ అధికారులు తేల్చారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సీఐడీ అధికారులు ఈ కేసులో తొలి చార్జిషీటును దాఖలు చేసింది.

More Telugu News