: జయ సర్కారుకు సుప్రీం బ్రేకులు!...శశికళ పుష్ప అరెస్టుపై స్టే!

తమిళనాడులోని జయలలిత సర్కారుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పరువు నష్టం దావాలను దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల జయలలితపై మండిపడ్డ సుప్రీంకోర్టు... తాజాగా అన్నాడీఎంకే నుంచి బహిష్కరణ వేటు పడ్డ రాజ్యసభ సభ్యురాలు శశికళా పుష్పకు అనుకూలంగా తీర్పునిచ్చింది. పనిమనుషులపై పుష్ప భర్త, కొడుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమె కుటుంబాన్ని అరెస్ట్ చేసే విషయంలో తమిళనాడు పోలీసులకు సుప్రీంకోర్టు బ్రేకులేసింది. శశికళ పుష్ప దాఖలు చేసుకున్న యాంటిసిపేటరీ బెయిల్ పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కు అప్పగించిన సుప్రీం ధర్మాసనం... పుష్ప కుటుంబ సభ్యుల అరెస్ట్ పై ఆరు వారాల పాటు స్టే విధించింది.

More Telugu News