: టెక్కీలకు ఉద్యోగాలిచ్చి వెనక్కు తగ్గిన 31 కంపెనీలపై ఐఐటీల నిషేధం

హెల్త్ కేర్ స్టార్టప్ సంస్థ పోర్షియా మెడికల్, ఆన్ డిమాండ్ డెలివరీ సేవల సంస్థ గ్రోఫర్స్ సహా 31 కంపెనీలను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు నిషేధించాయి. ఈ కంపెనీలన్నీ గత సంవత్సరం క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా టెక్కీలకు ఆఫర్ లెటర్లు ఇచ్చి, ఆపై వాటిని రద్దు చేసుకోవడమో లేదా సుదీర్ఘకాలం జాయినింగ్ తేదీలను పొడిగిస్తూ రావడమో చేశాయి. గత సంవత్సరం జొమాటో సంస్థపై విధించిన నిషేధం ఈ సంవత్సరం కూడా వర్తిస్తుందని, జాయినింగ్ తేదీలను మార్చిన ఫ్లిప్ కార్ట్ పై నిషేధాన్ని విధించకుండా, వార్నింగ్ లెటర్ తో సరిపెట్టింది. 2015లో క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా ఇబ్బందులు పడిన అన్ని ఐఐటీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న మీదటే బ్లాక్ లిస్టు కంపెనీల జాబితా తయారు చేసినట్టు బాంబే ఐఐటీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, నిషేధానికి గురికాబడిన కంపెనీల్లో జాన్సన్ ఎలక్ట్రిక్, ఫండమెంటల్ ఎడ్యుకేషన్ వంటి దీర్ఘకాలంగా సేవలందిస్తున్న కంపెనీలూ ఉన్నాయి.

More Telugu News