: వాట్స్ యాప్ ప్రియుల కోసం వచ్చేసిన సరికొత్త 'జిఫ్' అప్ డేట్

సామాజిక మాధ్యమం వాట్స్ యాప్ యూజర్లు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న కదిలే బొమ్మలను పంపుకునే వెసులుబాటు దగ్గరైంది. చిన్న చిన్న వీడియోలు తీసి వాటిని 'జిఫ్' ఫార్మాట్ లో పంపుకునే సౌలభ్యాన్ని కల్పిస్తూ, కొత్త అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. ఇమేజ్ పంపేందుకు అవసరమయ్యే డేటాతోనే వీటిని కూడా పంపించుకోవచ్చు. ఆరు సెకన్ల కన్నా తక్కువ నిడివివున్న వీడియోలు తీసి వాటిని 'జిఫ్' రూపంలోకి మార్చి యూజర్లు తమ వారికి సెండ్ చేయవచ్చు. ఇక ఆరు కన్నా ఎక్కువ సెకన్ల నిడివివుంటే, వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. వాట్స్ యాప్ బీటా వర్షన్ 2.16.242 నుంచి ఈ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ సదుపాయం కావాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి బీటా వర్షన్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోవాలని వాట్స్ యాప్ వెల్లడించింది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ అప్ డేట్ పనిచేస్తుందని, ఐఓఎస్ యూజర్లకు త్వరలోనే ఈ సౌకర్యాన్ని దగ్గర చేస్తామని పేర్కొంది.

More Telugu News