: నూటికి 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉండాలన్నదే లక్ష్యం: చంద్రబాబు

ఆధిపత్య ధోరణులు లేకుండా పనిచేసే సంస్కృతిని తీసుకొస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నూటికి 80 శాతం మంది ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తితో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. టెక్నాలజీతో పాలన కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, పుష్కరాల నిర్వహణలో టెక్నాలజీ ఉపయోగ పడిందన్నారు. ఈపోస్ విధానంతో రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టామని, వ్యవస్థను ప్రక్షాళన చేసి అవినీతిని రూపుమాపుతామని అన్నారు. టెక్నాలజీతో వాతావరణం వివరాలు తెలుసుకోవచ్చని, విశాఖపట్టణంలో ఎక్కడ వీధి లైటు వెలిగింది, ఎక్కడ వెలగలేదో ఇక్కడే ఉండి తెలుసుకోవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News