: డబ్బు కోసం మోసాలకు పాల్పడే దేశం!: చైనాపై విరుచుకుపడిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాషింగ్టన్ లో ఆయన మాట్లాడుతూ, చైనాకు అమెరికా నాయకత్వంపై గౌరవం లేదని అన్నారు. అయితే ఈ విషయంలో చైనాను తప్పుపట్టలేమని ఆయన పేర్కొన్నారు. అమెరికా నాయకత్వంపై చైనాకు గౌరవం పెంచే స్థాయిని తీసుకొస్తానని ఆయన చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా భారీ సైనిక సంపత్తిని మోహరిస్తోందని, అందుకు చైనాను అనుమతించమని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యపరంగా చూసినా, సైనిక, ఆయుధ సంపత్తి పరంగా చూసినా చైనా కంటే అమెరికా శక్తిమంతమైన దేశమని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా పనికిరాని నిందలు వేసే దేశమని ఆయన నిందించారు. డబ్బు కోసం మోసాలకు పాల్పడే దేశమని ఆయన పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏఏ దేశాలైతే వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉల్లంఘిస్తాయో వాటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అమెరికా కార్మికులకు ఇబ్బందులు కలిగించే ఏ దేశాన్నైనా తాము సహించమని ఆయన హెచ్చరించారు.

More Telugu News