: వారణాసిలో వరదల ప్రభావం... ఇంటిపై కప్పు పైనే శతాధిక వృద్ధుడి అంత్యక్రియలు

ఉత్తరప్రదేశ్ లో వర్షాలు ముంచెత్తుతుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. యూపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో గంగానది పొంగిపొర్లుతోంది. దీంతో, అక్కడి ఘాట్లన్నీ నీట మునిగాయి. దీంతో, మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించడం కష్టమైపోయింది. అయితే, దీనికొక ఉపాయం ఆలోచించారు. గంగానది ఒడ్డున ఉన్న మూడంతస్తుల భవనం రూఫ్ టాప్ పై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు 103 ఏళ్ల ఒక శతాధిక వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన చితాభస్మాన్ని గంగలో కలిపారు. ఈ సందర్భంగా శతాధిక వృద్ధుడి మనవడు సింగ్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎవరు చనిపోయినా గంగానది ఒడ్డునే అంత్యక్రియలు నిర్వహిస్తుంటామని చెప్పారు. వారణాసిలో వరదల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ, తమ సంప్రదాయం ప్రకారం తన తాత అంత్యక్రియలు ఈ విధంగా నిర్వహించాల్సి వచ్చిందని చెప్పారు.

More Telugu News