: మహారాష్ట్రతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం మహా దగా ఒప్పందం: రేవంత్ రెడ్డి

మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకున్న ఒప్పందం మహా దగా ఒప్పందమని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద తాకట్టుపెట్టారని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో శాశ్వత పరిష్కారం అంటూ మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నారని ఆయన తెలిపారు. తుమ్మిడిహట్టి ఎత్తు తగ్గింపుతో 50 వేల కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్రంపై పడుతుందని ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రాజెక్టు నిర్మాణాలను ఎందుకు ఆపేశారో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో చేవెళ్లను తొలగించి, కాళేశ్వరంను ఎందుకు కలిపారో స్పష్టత ఇవ్వాలని ఆయన అడిగారు. టెండర్ల ప్రక్రియలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. మహారాష్ట్ర ఒప్పందంలో కుట్రను రేపు బహిర్గతం చేస్తామని ఆయన చెప్పారు.

More Telugu News