: తూర్పు, ఈశాన్య భార‌తంలో భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 6.8గా న‌మోదు

తూర్పు, ఈశాన్య భార‌తంలో ఈరోజు భూకంపం సంభ‌వించింది. అసోం, పాట్నా, రాంచీ, కోల్‌క‌తా, గౌహ‌తి, భువ‌నేశ్వ‌ర్‌ లలో భూమి కంపించింది. దాంతో భ‌యంతో ఇళ్ల నుంచి జ‌నం బయటకు ప‌రుగులు తీశారు. మ‌య‌న్మార్‌లో భూకంప కేంద్రం ఉన్న‌ట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. భూకంప తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేలుపై 6.8గా న‌మోదయిన‌ట్లు చెప్పారు. ఈ కారణంగా ఈశాన్య, ఉత్త‌ర‌ భార‌త ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News