: డయాబెటిస్ వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారా?... అయితే,ఇవి తినండి!

టైప్ 2 డయాబెటిస్ వల్ల కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారా? అయితే ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలున్న ఆహార పదార్థాలు తీసుకుంటే అలాంటి ఆందోళన నుంచి తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డయాబెటిక్ రెటినోపతి సమస్యతో బాధపడేవారికి కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అలాంటి వారు వారంలో రెండుసార్లు ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలున్న ఆహారపదార్థాలు తీసుకుంటే ఆ ముప్పు నుంచి బయటపడవచ్చని వారు తెలిపారు. స్పెయిన్ లో 2003 నుంచి 2009 వరకు 55-80 ఏళ్ల మధ్య వయస్కులైన టైప్-2 డయాబెటిస్ రోగులపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగు చూసినట్టు పరిశోధకులు తెలిపారు. మానవుని కంట్లోని రెటీనాలో ఒమెగా-3 పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయని, మధుమేహంవల్ల రెటీనా దెబ్బతినకుండా ఈ ఆమ్లాలు కాపాడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనల వివరాలను జామా ఆప్తమాలజీ ఆన్ లైన్ జర్నల్ లో ప్రచురించారు. ఒమేగా-3 ఆమ్లాలు చేపల్లో అధికంగా దొరుకుతాయన్న సంగతి తెలిసిందే.

More Telugu News