: చిదంబరం ఫ్యామిలీకి మరో నోటీసు!... విచారణకు రావాలని నళినికి ఈడీ తాఖీదు!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కుటుంబానికి దర్యాప్తు సంస్థల నుంచి నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి. ఇప్పటికే చిదందరం కుమారుడు కార్తీ చిదంబరం కంపెనీలపై సీబీఐ, ఆదాయపన్ను శాఖ అధికారులు వరుసగా సోదాలు చేశారు. ఈ కేసులో కార్తీకి దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు అందాయి. తాజాగా చిదంబరం సతీమణి, సుప్రీంకోర్టు న్యాయవాది నళిని చిదంబరానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. శారదా చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించి వచ్చే నెలలో కోల్ కతాలోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఈడీ నళినికి ఆదేశాలు జారీ చేసింది. ఓ కేసు విషయంలో నళిని చిదంబరానికి శారదా చిట్ ఫండ్ నుంచి పెద్ద మొత్తంలో ఫీజు అందింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న ఈడీ తాజాగా ఆమెకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెలలో తమ ముందు హాజరుకానున్న నళిని వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేయనున్నట్లు సమాచారం.

More Telugu News