ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కమలహాసన్ కు అభినందనలు తెలిపిన కేరళ సీఎం

Tue, Aug 23, 2016, 09:24 PM
Related Image ఫ్రాన్స్ దేశపు ‘చెవాలియర్ అవార్డు’కు ఎంపికైన ప్రముఖ నటుడు కమలహాసన్ కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమల్ కు ఆయన ఒక లేఖ రాశారు. చిత్ర రంగ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తన నటన ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమ గొప్పదనాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తున్నందుకు గాను కమల్ ను ఈ అవార్డు వరించిందని ఆ లేఖలో పినరయి విజయన్ పేర్కొన్నారు. కాగా, తమిళ నటుడు శివాజీ గణేశన్ తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో తమిళ నటుడు కమల్ కావడం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Articles (Latest)
Articles (Education)