: నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కాంగ్రెస్ పార్టీ ఆఫర్

భారతీయ జనతా పార్టీకి ఇటీవల గుడ్ బై చెప్పిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చింది. ఈ సందర్భంగా పంజాబ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమరీందర్ సింగ్ మాట్లాడుతూ, సిద్ధూ తండ్రి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారని, ఆయన కోసం తమ పార్టీ తలుపులు తెరిచి ఉంచిందని అన్నారు. కాగా, బీజేపీ నుంచి బయటకు వచ్చేసిన సిద్ధూను తమ పార్టీలో చేరాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇటీవలే ఆహ్వానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందింది. అయితే, ఏ పార్టీలో చేరుతున్నది సిద్ధూ ఇంకా ప్రకటించలేదు.

More Telugu News