: నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లను బ్రిటిషర్లు ఉరి తీశారు: మంత్రి జవదేకర్ పొరపాటు వ్యాఖ్యలు

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తన పొరపాటు వ్యాఖ్యల ద్వారా చరిత్రను తిరగరాశారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ లోని షిన్ ద్వారాలో జరిగిన ‘తిరంగా యాత్ర’ లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన సందర్భంలో జరిగింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను బ్రిటిషర్లు ఉరి తీయడంతో వారు అమరవీరులయ్యారని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలతో పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కాగా, దేశ మొదటి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ 1964లో సహజ మరణం పొందారు. కేంద్ర మాజీ హోం మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950లో మృతి చెందారు. సుభాష్ చంద్రబోస్ మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన రెండు కమిషన్లు 1945 ఆగస్టు 18న తైపీలో జరిగిన విమానప్రమాదంలో బోస్ మరణించారని చెప్పగా, జస్టిస్ ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని దర్యాప్తు సంఘం మాత్రం బోస్ బతికే ఉన్నారని సూచిస్తోంది.

More Telugu News