ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

‘సింగం’ గెటప్ లో వల్లభనేని!... చూపరులను కట్టిపడేస్తున్న టీడీపీ యువనేత వెరైటీ లుక్!

Tue, Aug 23, 2016, 12:08 PM
రియో ఒలింపిక్స్ సిల్వర్ స్టార్ పీవీ సింధుకు విజయవాడలో లభించిన ఘన స్వాగతం సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నేటి ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ లకు ఘన స్వాగతం పలికేందుకు ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. అందరి విషయం ఎలా ఉన్న గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ యువనేత వల్లభనేని వంశీమోహన్ అందరి దృష్టిని ఆకర్షించారు.

స్వతహాగానేే పొడగరి అయిన వల్లభనేని... తాజాగా ‘సింగం’ చిత్రంలో తమిళ స్టార్ హీరో సూర్య తరహాలో పెద్దగా మీసాలు పెంచి ఆ హీరో మాదిరి కనిపించారు. ఎయిర్ పోర్టులో సింధుకు స్వాగతం పలికిన తర్వాత సింధు వెంటే ఓపెన్ టాప్ వాహనం ఎక్కిన వల్లభనేని... సింధు పక్కనే కూర్చుండిపోయారు. ‘సింగం’ స్టైల్ లో మీసకట్టు, కళ్లద్దాలు పెట్టుకుని కూర్చున్న ఆయన నిజంగా స్టార్ హీరోలానే కనిపించారు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Articles (Latest)
Articles (Education)