: కోచ్ గా గోపీచంద్ ఓకే!... అయినా సింధుకు కొత్త కోచ్ ను వెతుకుతున్నామన్న తెలంగాణ డిప్యూటీ సీఎం!

రియో ఒలింపిక్స్ లో భారత సత్తా చాటిన స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి మరువరానిదన్న విషయం తెలిసిందే. సింధునే కాకుండా ఆమె లాంటి చాలామంది క్రీడాకారులను గోపీచంద్ తీర్చిదిద్దారు. అకుంఠిత దీక్షతో సత్తా కలిగిన ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న గోపీచంద్ కు తెలంగాణ సర్కారు నుంచి భారీ షాక్ తగిలింది. రజత పతకంతో హైదరాబాదు వచ్చిన పీవీ సింధుతో పాటు ఆమె కోచ్ గా గోపీచంద్ ను కూడా కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అయితే అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ... జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోచ్ గా గోపీచంద్ మెరుగ్గా రాణిస్తున్నారని కితాబిచ్చిన అలీ... పీవీ సింధుకు మాత్రం మరింత మెరుగైన కోచ్ కోసం వెతుకుతున్నామని ప్రకటించారు.

More Telugu News