: చేతిలో డబ్బుల్లేక స్టార్టప్ ల గిలగిల!... లాభాల కోసం ఇన్వెస్టర్ల ఒత్తిడే కారణమట!

దేశంలో మొన్నటిదాకా స్టార్టప్ ల హవా కొనసాగింది. వినూత్న ఆలోచనలతో చిన్న మొత్తాలతో ప్రారంభమైన స్టార్టప్ లలో పెట్టుబడుల కోసం టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా లాంటి వారు క్యూ కట్టారు. నేరుగా స్టార్టప్ కార్యాలయాలకు వెళ్లిన పారిశ్రామిక దిగ్గజాలు అడక్కుండానే సదరు సంస్థలకు నిధుల వరద పారించారు. సదరు నిధులంతా ఆయా సంస్థల్లో పెట్టుబడులుగా మారాయి. వాటికి ప్రతిఫలం అందాలంటే మరింత సమయం పడుతుంది. అయితే, ఈలోగానే పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు లాభాలేవి? అంటూ ఆ సంస్థలను నిలదీస్తున్నారట. దీంతో పెట్టుబడిగా అందిన నిధులు ఖర్చైపోగా, చేతిలో చిల్లిగవ్వ కూడా లేని స్థితిలో స్టార్టప్ లు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ ఫలితంగానే ఆస్క్ మీ. కామ్ ఏకంగా తన కార్యకలాపాలనే మూసివేయగా, అంతకుముందే ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, ఓలా వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి.

More Telugu News