: తమిళనాట ‘మాక్ అసెంబ్లీ’!... విపక్ష నేత స్టాలిన్ సహా 60 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై కేసు!

తమిళనాట విపక్షంపై అధికార పక్షం అణచివేత వైఖరి కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార, విపక్షాలు ఢీకొన్నాయి. ఈ క్రమంలో సీఎం జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ డీఎంకే ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అధికార పక్షం కఠిన వైఖరి అవలంబిస్తోందంటూ నిన్న విపక్ష నేత స్టాలిన్ తన పార్టీ డీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి ‘మాక్ అసెంబ్లీ’ని నిర్వహించారు. దీనిపై అధికార పక్షం భగ్గుమంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు స్టాలిన్ సహా 60 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారు.

More Telugu News