: ఒక్క వెండి పతకానికే 'ఇన్ క్రెడిబుల్ ఇండియా' అయిపోతే, 46 బంగారు, 37 వెండి పతకాల అమెరికాను ఏమనాలి?: వర్మ సెటైర్ కు నెట్టింట దీటైన జవాబు!

రియోలో సిల్వర్ మెడల్ సాధించి, ఇండియాకు వచ్చిన పీవీ సింధుకు ఘనస్వాగతం పలుకుతున్న వేళ, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేయగా, దానికి నెట్టింట దీటైన జవాబు వచ్చింది. "ఒక్క సిల్వర్ పతకానికే మనల్ని మనం ఇన్ క్రెడిబుల్ ఇండియా అని పిలుచుకుంటున్నాం. ఇక 46 బంగారు, 37 వెండి, 49 కాంస్య పతకాలు సాధించిన అమెరికాను ఏమని పిలవాలి? జస్ట్ అడుగుతున్నా" అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి ఓ అభిమాని పెట్టిన సమాధానం ఏంటంటే "ఇండియాలో ప్రజలు మిమ్మల్ని ఓ దర్శకుడిగా భావిస్తున్నారు. అదే మీరు అమెరికా వెళితే, ఓ మనిషిగా కూడా చూడరు. అంతే తేడా" అన్నాడు. అడుగడుగునా నీ లాంటి వ్యంగ్యాస్త్రాలు వేసే వారుండబట్టే ఇండియా తక్కువ పతకాలతో ఆగిపోయిందని ఒకరు, ఇక్కడి వసతులతో అమెరికా గెలిచిన పతకాలకన్నా, ఈ రెండు పతకాలే గొప్పవని మరొకరు. మన పొరుగు దేశాలకు పతకాలే లేని వేళ, ఉత్త చేతులతో తిరిగిరాని ఇండియాను ఎందుకు అంటున్నారని ఇంకొకరు వర్మను దెప్పి పొడుస్తున్నారు.

More Telugu News