ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కల్యాణ్ ది రాజీ ధోరణితో ముందుకు వెళ్లే నేచర్ కాదు: స్టార్ మేకర్ సత్యానంద్

Sun, Aug 21, 2016, 08:16 PM
హీరో పవన్ కల్యాణ్ ది కాంప్రమైజ్ అవుతూ, ముందుకు వెళ్లే నేచర్ కాదని, మొదటి నుంచి ఆయన మనస్తత్వం అంతేనని ప్రముఖ స్టార్ మేకర్, సత్యానంద్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ అధినేత సత్యానంద్ పేర్కొన్నారు. తన ఇనిస్టిట్యూట్ ద్వారా ఎందరో స్టార్ హీరోలను తయారు చేసిన ఆయన ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "పవన్ కల్యాణ్ ఆలోచనలు చాలా జెన్యూన్ గా ఉంటాయి. ఎక్కడా డీవియేషన్స్ ఉండవు. ముక్కుసూటిగా మాట్లాడతారు. నేను శిక్షణ ఇచ్చే సమయంలో క్లాసులో పవన్ చేసిన నటన ఆయనకు నచ్చకపోతే కనుక, మరోసారి చేస్తానని చెప్పేవాడు. అంటే, కాంప్రమైజ్ అయి ముందుకు వెళ్లిపోదామనే నేచర్ మొదటి నుంచి లేదు. మనం ఎదిగే కొద్దీ తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి. కనుక, ఆయనలో క్లారిటీ మరింత ఎక్కువగా ఉంది’ అని చెప్పారు. తాను సినిమాల్లో ఎక్కువగా నటించాలని ఎప్పుడూ అనుకోలేదని, అందుకే ఎవరినీ అడగలేదని.. తన దృష్టంతా మొదటి నుంచి నాటకాలపైనే ఉండేదని ఒక ప్రశ్నకు సమాధానంగా సత్యానంద్ చెప్పారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Articles (Latest)
Articles (Education)