: సత్వర న్యాయం కలగానే ఉండిపోయింది: చీఫ్ జస్టిస్ ఠాకూర్ సంచలన వ్యాఖ్య

ఇండియాలో 'సత్వర న్యాయం' ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిమ్లాలో జరిగిన హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ 23వ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించిన ఆయన, ప్రజాస్వామ్యంలో మూడవ మూలస్తంభమైన న్యాయ వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం దగ్గర కావాల్సి వుందని, అభివృద్ధి పథంలో దూసుకు వెళుతున్న ఇండియా, ఈ విషయంలో ఎంతో దూరంలో నిలిచిపోయిందని ఠాకూర్ అభిప్రాయపడ్డారు. 1950 నుంచి భూ సంస్కరణలు ఆగిపోయాయని, స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ, ప్రజలందరికీ మంచినీరు, కనీస వైద్య వసతి దగ్గర కాలేదని అన్నారు. నాలుగు దశాబ్దాల అభివృద్ధి ప్రణాళికలు 70 కోట్ల స్మార్ట్ ఫోన్లను, 33.2 కోట్ల ఇంటర్నెట్ వాడకందార్లను మాత్రమే ఇచ్చాయని అన్నారు. సవాళ్లనన్నింటినీ అధిగమిస్తేనే ఇండియా ముందడుగు వేస్తుందని ఠాకూర్ అభిప్రాయపడ్డారు.

More Telugu News