: మధ్యప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్న వరదలు.. 24 గంటల్లో 15 మంది మృత్యువాత

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మధ్యప్రదేశ్ చిగురుటాకులా వణుకుతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల ధాటికి 24 గంట్లలో 15 మంది మృత్యువాత పడ్డారు. వర్షానికి సత్న జిల్లాలోని మెహర్ పట్టణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 25 మంది సజీవ సమాధి అయినట్టు చెబుతున్నారు. 200 గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ఆహారం, నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వందలాది గ్రామాలు అంధకారంలో చిక్కుకుపోయాయి. రోడ్లు తెగిపోవడంతో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

More Telugu News