: దేశవ్యాప్తంగా 10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీ.. బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ కాకపోవడమే కారణం

దేశవ్యాప్తంగా 8-10 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మానవ వనరుల అభివృద్ధిశాఖ సహాయమంత్రి మహేంద్రనాథ్ పాండే పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఈ పోస్టులు చాలాకాలంగా భర్తీకాకపోవడంతో ఖాళీలు పేరుకుపోయినట్టు తెలిపారు. బ్యాక్‌లాగ్‌ల పోస్టులు భర్తీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. అలాగే 1976 నుంచి ఎటువంటి సవరణలకు నోచుకోని విద్యావిధానంపై సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్టు వివరించారు. అఖిల భారతీయ బ్రాహ్మిణ్ మహాసభ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది టీచర్ పోస్టులు భర్తీకి నోచుకోకుండా ఉన్నాయన్న సంగతి వాస్తవమేన్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులు సంవత్సరాలుగా భర్తీ కాకపోవడమే ఇందుకు కారణమని వివరించారు. త్వరలోనే బోధనా సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థల్లో దాదాపు పది లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించినట్టు మంత్రి తెలిపారు.

More Telugu News