: ర‌ఘురాం రాజ‌న్‌పై మ‌ళ్లీ మండిప‌డ్డ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి

గత కొన్ని రోజులుగా ప్రత్యర్థులపై విమర్శల వాన కురిపించడాన్ని వాయిదా వేసుకున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మ‌ళ్లీ త‌నదైన శైలిలో విమర్శల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై ఆయ‌న ఎన్నోసార్లు విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. మరికొన్ని వారాల్లో రాజన్ పదవీ కాలం కూడా ముగియనుంది. అయిన‌ప్ప‌టికీ రాజ‌న్‌పై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిపై మరోసారి మండిప‌డ్డారు. రాజన్ ను 'ఆర్ 3' (రఘు రాం రాజన్... ఈ పేరులోని మూడు పదాలలోని మొదటి 'ఆర్' అక్షరాన్ని తీసుకుని అలా సంబోధించారు) అని పేర్కొన్నారు. దేశంలో త‌లెత్తిన రుణాత్మ‌క‌ ద్రవ్యోల్బణ పరిస్థితులకు రఘురాం రాజనే కార‌ణ‌మ‌ని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి అన్నారు. ఈ అంశాన్ని తెలుపుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించిన వర్కింగ్ పేపర్‌ను ఆయన కోట్ చేస్తూ.. రాజన్ చేప‌ట్టిన‌ వడ్డీ రేట్ల విధానమే ద్రవ్యోల్బణానికి కార‌ణ‌మ‌ని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 2013, సెప్టెంబర్ లో ఆర్‌బీఐ గవర్నర్‌గా ర‌ఘురాం రాజ‌న్ బాధ్యతలు స్వీకరించిన సంగ‌తి తెలిసిందే. దేశంలో ఆర్థికాభివృద్ధే ల‌క్ష్య‌మంటూ స్వల్పకాలిక లెండింగ్ రేట్లను రాజ‌న్‌ 7.25 శాతం నుంచి 8 శాతం పెంచి 2014 వరకు అవే రేట్లు ఉండేలా చూశారు. జనవరి 2015 లో రేట్లు తగ్గించారు. అప్పటి నుంచి 6.50 శాతంనుంచి 1.5 శాతం మేర తగ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

More Telugu News