: ఒలింపిక్స్‌లో తొలిస్వర్ణం సాధించిన త‌జకిస్థాన్‌

బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జ‌రుగుతున్న ఒలింపిక్స్‌లో తజకిస్థాన్ పురుషుల హ్యామర్‌త్రోలో స్వర్ణం సాధించింది. ఆ దేశానికి ఒలింపిక్స్‌లో స్వర్ణం రావ‌డం ఇదే తొలిసారి. 1991లో సోవియట్‌ యూనియన్‌ నుంచి త‌జ‌కిస్థాన్‌ స్వతంత్ర దేశంగా అవతరించిన సంగ‌తి తెలిసిందే. హ్యామర్‌త్రోలో త‌జ‌కిస్థాన్‌కి ప్రాతినిధ్యం వ‌హించిన‌ దిల్షూద్‌ నాజరోవ్ త‌మ దేశానికి తొలి స్వ‌ర్ణాన్ని అందించాడు. ఉక్కుగోళాన్ని 78.68మీటర్ల దూరం విసిరిన దిల్షూద్ తొలిస్థానంలో నిలిచి స్వ‌ర్ణ ప‌తకం కైవ‌సం చేసుకున్నాడు. రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ పోటీల్లో పాల్గొనే అవ‌కాశం ద‌క్కించుకున్న బెలారస్‌కు చెందికు ఇవాన్ ఉక్కుగోళాన్ని 77.79 మీటర్ల దూరం విసిరి రజత ప‌త‌కాన్ని సాధించాడు.

More Telugu News