: బ్యాడ్మింటన్ స్వర్ణం, కాంస్యం సింధుతో ఆడినవాళ్లకే... 'వెండి'కొండ పీవీ సింధు!

వరల్డ్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో స్వర్ణ, కాంస్య పతక విజేతలు సింధుతో ఆడినవారు కావడం విశేషం. సెమీ ఫైనల్లో నజోమి ఒకుహరాను సింధు ఓడించి ఫైనల్ చేరింది. దీంతో కాంస్యపతకం కోసం జరిగిన పోరులో గాయం కారణంగా ప్రత్యర్థి వెనుదిరగడంతో బ్రాంజ్ మెడల్ ఆమె సొంతమైంది. అనంతరం ఫైనల్స్ లో వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి మారిన్ 'బంగారు'కొండ అనిపించుకుంది. దీంతో 'వెండి'కొండలా నిలిచిన సింధు, భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. అంతేకాదు, భారత్ తరపున వ్యక్తిగత రజతం సాధించిన ఏకైక క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది. ఇంత వరకు ఒలింపిక్ పతకాలు సాధించిన జాబితాలో నిలిచిన సాక్షి మాలిక్, సైనా నెహ్వాల్, మేరీ కోం, కరణం మల్లీశ్వరిలు కాంస్య పతకాలు మాత్రమే సాధించగా, సింధు రజతపతకం సాధించడం విశేషం.

More Telugu News