: పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న ‘హార్లే డేవిడ్ సన్’కు భారీ జరిమానా

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ 'హార్లే డేవిడ్ సన్'కు అమెరికా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే ‘సూపర్ ట్యూనర్’ పరికరాన్ని ఈ బైక్ లో వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందంటూ అక్కడి పర్యావరణ పరిరక్షణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిని విచారించిన కోర్టు, ఆగస్టు 23 లోగా ఈ వాహనాల వాడకాన్ని ఆపివేయాలంటూ తీర్పు నిచ్చింది. దీంతోపాటు 12 మిలియన్ డాలర్లు జరిమానా కూడా విధించింది. కాగా, 2008 నుంచి అమెరికాలో హార్లే డేవిడ్ సన్ తన ద్విచక్ర వాహనాలు విక్రయిస్తోంది. ఈ వాహనాల్లోనే సూపర్ ట్యూనర్ పరికరాన్ని అమర్చి సదరు సంస్థ ఆ వాహనాలను తయారు చేసింది.

More Telugu News