: తిరుచ్చి సెంట్రల్ జైలులో ఖైదీలకు 'రెచ్చగొట్టే' సాహిత్యాన్ని అందించిన టీచర్

ప‌రిస్థితుల ప్రభావంతో హంత‌కులుగా, నేర‌స్తులుగా మారిన వారు వుండే ప్రదేశం అది. అందుకే ఆ ఖైదీల‌కు జైలులో మంచి వాతావ‌ర‌ణం క‌ల్పించి వారిలో సంస్కార ప‌రివ‌ర్త‌న తీసుకురావాలి. ఆ ప్ర‌య‌త్నంలోనే జైలు అధికారులు వుంటున్నారు. ఈ క్రమంలో, ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డవారు, హ‌త్య‌లు చేసిన వారు ఇక అటువైపు వెళ్ల‌కుండా వారికి విద్యాబుద్ధులు నేర్పించడానికి తిరుచ్చి సెంట్రల్ జైలులో అధికారులు ఒక శాశ్వ‌త‌ టీచర్‌ను కూడా నియ‌మించారు. అయితే, ఆ టీచ‌రు మాత్రం వారు మంచి మార్గంలో న‌డిచేలా పాఠాలు చెప్ప‌కుండా వారికి ఏకంగా రెచ్చగొట్టే సాహిత్యాన్ని (పోర్నోగ్రఫీ) అందిస్తున్నాడు. ఈ విష‌యాన్ని తెలుసుకొని జైలు అధికారులే షాక్ తిన్నారు. 55 ఏళ్ల బాబు ఎంతో కాలంగా జైలులో ఖైదీల‌కు పాఠాలు చెబుతున్నాడు. 1,350 మంది ఖైదీలు ఉన్న ఆ జైలులో ఎంతో మంది ఖైదీలు స్కూలు, కాలేజీ విద్యను అభ్య‌సిస్తున్నారు. జైల్లోనే పాఠాలు చెబుతారు. ఖైదీల వ‌ద్ద ఆ రెచ్చగొట్టే సాహిత్యం ఉంద‌ని జైలు అధికారులు గ‌మ‌నించారు. అయితే, జైలులోకి ఆ సాహిత్యం ఎలా వస్తోందనే అంశంపై వారు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఈ విష‌యంపై మ‌రింత దృష్టి పెట్టారు. రోజులాగానే టీచర్ కొన్ని మ్యాగజైన్లతో జైలుకు ఖైదీల‌కు పాఠాలు చెప్పేందుకు వ‌చ్చాడు. ఈసారి పోలీసులు ఆ మ్యాగ‌జైన్‌ల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేశారు. టీచర్ తెచ్చిన మ్యాగజైన్ల మధ్యలో పోర్నోగ్రఫీ సామగ్రి చూసి షాకయ్యారు. టీచ‌ర్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీనిపై సీర‌ియ‌న్ అయిన అధికారులు టీచ‌ర్ బాబుని విధుల్లోంచి తీసేశారు.

More Telugu News