: ట్రంప్ పై హిల్లరీ ఆధిక్యం...కేవలం నాలుగు శాతమే!

అమెరికాకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హిల్లరీ క్లింటన్ నే విజయం వరిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు 9-16 మద్యలో 2,010 మందితో (1,567 రిజిస్టర్డ్ ఓటర్లు కలిపి) ఈ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ట్రంప్ కంటే హిల్లరీకే అధ్యక్షురాలయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దుందుడుకు వ్యాఖ్యలు, తీవ్ర స్థాయి విమర్శలు డొనాల్డ్ ట్రంప్ కు చేటుచేసినట్టే సర్వేలు చెబుతున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థిగా ప్రకటించక ముందు సహచరులను ఓడించేందుకు ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోసారి అమెరికాను గ్రేట్ గా తీర్చిదిద్దుదామని ట్రంప్ ఇచ్చిన పిలుపుకు మొదట్లో భారీ మద్దతు లభించింది. ట్రంప్ దూకుడుకు హిల్లరీ సరితూగే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ దశలో చోటుచేసుకున్న బ్లాక్ అండ్ వైట్ అల్లర్లు, ఒబామా వ్యాఖ్యలు, ప్రధానంగా మాజీ సైనికుడైన ముస్లిం కమాండర్ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు, వారిచ్చిన వివరణ ఆ దేశ ప్రజల ఆలోచనల్లో తీవ్ర మార్పులు తీసుకొచ్చాయి. దీంతో ట్రంప్ ప్రభావం ఒక్కసారిగా తగ్గడం ప్రారంభించింది. ఈ దశలో కాబోయే అమెరికా ఫస్ట్ లేడీ నగ్న చిత్రాలు అంటూ ట్రంప్ రెండో భార్య నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం, ఇంతలో గతంలో ట్రంప్ లైంగిక వేధిపులకు గురైన మహిళ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం వంటివన్నీ ఆయన ప్రాభవానికి గండికొట్టాయి. దీంతో అమెరికాకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 41 శాతం మంది రిజిస్టర్డ్ ఓటర్లు హిల్లరీకే ఓటేస్తారని, దీంతో అమెరికా తొలి అధ్యక్షురాలిగా హిల్లరీ చరిత్ర నెలకొల్పుతారని ప్యూ సర్వే పేర్కొంది. అమెరికాలో 37 శాతం మంది ఓటర్లు ట్రంప్ కు మద్దతు పలుకుతున్నారని ఈ సర్వేలో పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభం వరకు అమెరికన్ ఓటర్లు అధ్యక్ష పదవికి హిల్లరీ లేదా ట్రంప్ లో ఎవరు సరియైన వారో పోల్చుకోవడంలో సందిగ్థంలో ఉన్నారని, ఇప్పడు ఫుల్ క్లారిటీతో ఉన్నారని ప్యూ సర్వే తెలిపింది. 27 శాతం మంది అమెరికన్లు ట్రంప్ ను అమెరికాకు గ్రేట్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశముందని పేర్కొంటుండగా, దానికి డబుల్ శాతం అంటే 54 శాతం మంది ట్రంప్ ను అత్యంత ప్రమాదకరమైన అధ్యక్షుడయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారని ఈ సర్వే తెలిపింది. 15 శాతం మంది ట్రంప్ యావరేజ్ ప్రెసిడెంట్ గా నిలుస్తాడని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో 31 శాతం మంది హిల్లరీ గ్రేట్ ప్రెసిడెంట్ గా మన్నలు పొందగలరని పేర్కొంటున్నారని ఈ సర్వే వెల్లడించింది.

More Telugu News