: లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన ‘రిలయన్స్’కు భారీ జరిమానా

కేజీ-డి 6 క్షేత్రాల నుంచి లక్ష్యం కంటే తక్కువ సహజ వాయువు ఉత్పత్తి చేసిందనే కారణంతో ‘రిలయన్స్’, దాని భాగస్వామ్య సంస్థలపై కేంద్ర ప్రభుత్వం 380 మిలియన్ డాలర్ల (సుమారు 2500 కోట్ల రూపాయలు) భారీ జరిమానా విధించింది. 1 ఏప్రిల్ 2010 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదు ఆర్థిక సంవత్సరాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని సదరు సంస్థ చేరుకోకపోవడంతో ఈ జరిమానా విధించాల్సి వచ్చింది. కాగా, గ్యాస్ పూల్ ఖాతాలో స్థూల 81.7 మిలియన్ డాలర్లను ప్రభుత్వం ఇప్పటికే తమ వద్ద నుంచి వసూలు చేసిందని రిలయన్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

More Telugu News