: జీఎస్‌టీ బిల్లుతో నష్ట‌పోయే రెవెన్యూను ఐదేళ్ల పాటు భ‌ర్తీ చేస్తామ‌ని కేంద్రం హామీ ఇచ్చింది: కేటీఆర్

ఇటీవ‌లే రాజ్య‌స‌భ, లోక్‌స‌భ‌ల్లో ఆమోదం పొందిన వ‌స్తుసేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) బిల్లును కేంద్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి తేవాల‌ని చూస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ బిల్లును ఇప్ప‌టికే అసోం, బీహార్‌, జార్ఖండ్ రాష్ట్రాలు ఆమోదించాయి. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఈ బిల్లుకి ఆమోదం తెలపాల‌ని నిర్ణ‌యించుకుంది. దీని కోసం త్వ‌ర‌లోనే అసెంబ్లీ సెష‌న్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈరోజు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీడియాకు తెలిపారు. తెలంగాణ శాస‌న‌స‌భ‌ బిల్లును ఆమోదిస్తుందని ఆయన స్ప‌ష్టం చేశారు. బిల్లుతో రాష్ట్రం నష్ట‌పోయే రెవెన్యూను ఐదేళ్ల పాటు భ‌ర్తీ చేస్తామ‌ని కేంద్రం హామీ ఇచ్చిందని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News