: సెక్షన్ 89ని రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని ఎక్కడా లేదు: తెలంగాణ ప్రభుత్వం

సెక్షన్ 89ని రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఎక్కడా లేదని, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని మాత్రమే ఉందని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ దృష్టికి తీసుకువచ్చింది. కృష్ణా జలాల కేటాయంపు విషయంలో ఇతర రాష్ట్రాల విభజన చట్టాలతో ఏపీ విభజన చట్టాన్ని పోల్చి చూడవద్దని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు పార్లమెంట్ దృష్టికి వెళ్లాయి కనుకనే చట్టంలో సెక్షన్ 89ని చేర్చారని, తద్వారా తెలంగాణకు అన్యాయం జరిగిందని పార్లమెంట్ లో గుర్తించినట్లు న్యాయవాదులు ట్రైబ్యునల్ కు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం 84, 85 సెక్షన్లను చట్టంలో చేర్చారని తెలిపారు. ఈ అంశంపై తెలంగాణ వాదనలు ముగియడంతో తదుపరి విచారణను వచ్చే నెల 7, 8 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు ట్రైబ్యునల్ పేర్కొంది.

More Telugu News