: నేటితో ముగియనున్న అమర్‌నాథ్ యాత్ర.. గణనీయంగా పడిపోయిన యాత్రికుల సంఖ్య

ఒకప్పుడు అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు ఇప్పుడు ఆసక్తి చూపడం లేదా? తాజా గణాంకాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 1.31 లక్షల మంది భక్తులు తగ్గిపోయారు. ఈ ఏడాది ఆగస్టు 16 వరకు 2,20,295 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువని ఓ అధికారి తెలిపారు. 2015లో 3,52,771 మంది భక్తులు అమరనాథుడ్ని దర్శించుకున్నారని, అప్పటితో పోలిస్తే 1.31 లక్షల మంది భక్తులు ఈసారి తగ్గిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇక 2014తో పోలిస్తే 1.52 లక్షల మంది తగ్గిపోయినట్టు వివరించారు. ఆ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తారని, ఏకంగా 3,72,909 మంది భక్తులు అమర్‌నాథ్‌లోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్టు పేర్కొన్నారు. కాగా పలు ఆటంకాల మధ్య సాగిన అమర్‌నాథ్ యాత్ర నేటితో ముగియనుంది.

More Telugu News