: సబ్ కమిటీ నివేదిక ప్రకారం... తెలంగాణలో కొత్త జిల్లాలు ఇవే!

కొత్త రాష్ట్రం తెలంగాణలో పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు జిల్లాల పునర్విభజనకు నడుం బిగించిన కేసీఆర్ ప్రభుత్వం... ఎట్టకేలకు ఆ కసరత్తును పూర్తి చేసింది. ఈ అంశంపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నిన్న తన నివేదికను సీఎం కేసీఆర్ కు అందజేసింది. ఈ నివేదికకు కేసీఆర్ యథాతథంగా ఆమోదం తెలిపితే... కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు కింది విధంగా వుంటాయి. 1. ఆదిలాబాదు జిల్లాలో కొత్తగా నిర్మల్, మంచిర్యాల 2. కరీంనగర్ జిల్లా... పెద్దపల్లి, జగిత్యాల 3. వరంగల్ జిల్లా... హన్మకొండ, మహబూబాబాదు, భూపాలపల్లి 4. మెదక్ జిల్లా... సంగారెడ్డి, సిద్దిపేట 5. నిజామాబాదు జిల్లా... కామారెడ్డి 6. ఖమ్మం జిల్లా... కొత్తగూడెం 7. నల్గొండ జిల్లా... సూర్యాపేట, యాదాద్రి 8. మహబూబ్ నగర్ జిల్లా... నాగర్ కర్నూలు, వనపర్తి 9. మిగిలిన హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలను మొత్తం నాలుగు జిల్లాలుగా విభజించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.

More Telugu News