: గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు 30 శాతం అధిక మార్కులు: సుప్రీంకోర్టు

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు పోస్టు గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల సమయంలో 30 శాతం మార్కులు అదనంగా ఇవ్వాలన్న ప్రతిపాదనకు అత్యున్నత న్యాయస్థానం ఓకే చెప్పింది. ఈ విషయంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే వైద్యులకు పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం సమయంలో 30 శాతం కోటా అమలు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. చట్టప్రకారం అది తగదని, కాకపోతే కోటాకు బదులు మార్కులు ఇవ్వవచ్చని తెలిపింది. ప్రస్తుతం 2016-17 సంవత్సరానికి గాను దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్కుల విధానం అమలులోకి వస్తుందని పేర్కొంది.

More Telugu News