: హిందీ సినిమాలు జాతీయ చిత్రాలు కావు.. తేల్చి చెప్పిన ప్రముఖ దర్శక నిర్మాత ఆదూర్ గోపాలకృష్ణన్

హిందీ సినిమాలు జాతీయ సినిమాలు అని చాలామంది భ్రమపడుతున్నారని, ముమ్మాటికి అది తప్పుడు అభిప్రాయమని ప్రముఖ దర్శక నిర్మాత ఆదూర్ గోపాలకృష్ణన్(75) తేల్చి చెప్పారు. దేశంలోని అన్ని భాషల్లానే హిందీ కూడా ఒకటని పేర్కొన్నారు. హిందీ సినిమాను జాతీయ సినిమాగా, మిగతా భాషల చిత్రాలను ప్రాంతీయ చిత్రాలుగా పేర్కొనడం తప్పని అన్నారు. ‘‘ఇతర భాషా చిత్రాలను ప్రాంతీయ చిత్రాలుగా పేర్కొనే అలవాటు మనలో పాతుకుపోయింది. అన్నీ జాతీయ సినిమాలే. హిందీ సినిమాలనే ప్రజలు జాతీయ సినిమాలుగా భావిస్తున్నారు. ఇది ముమ్మాటికీ తప్పు. హిందీ కూడా దేశంలో ఓ భాష అంతే’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ భాషా చిత్రాలు తప్ప ఇతర భాషల్లోని చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశం గర్వించదగ్గ ప్రముఖ దర్శక నిర్మాత సత్యజిత్‌రాయ్‌ను ఎవరూ బెంగాలీ దర్శకుడు అని చెప్పరని, భారతదేశ దర్శక నిర్మాతగానే పేర్కొంటారని వివరించారు. గోపాలకృష్ణన్ సినీ రంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ముంబైలోని గేట్‌వే లిట్‌ఫెస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

More Telugu News