: పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్తజనం!... పున్నమి ఘాట్ కు ప్రముఖుల తాకిడి!

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కృష్ణా పుష్కరాలు నేటితో ఆరో రోజుకు చేరుకున్నాయి. తొలి రోజు భారీ సంఖ్యలో పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తినా... ఆ తర్వాతి రోజుల్లో జనం కాస్తంత పలచబడ్డారు. తాజాగా నేటి తెల్లవారుజాము నుంచే పుష్కర ఘాట్లలో భక్తుల కోలాహలం నెలకొంది. రెండు రాష్ట్రాల్లోని ఘాట్లన్నిటికీ నేటి తెల్లవారుజామున భక్తులు పోటెత్తారు. ఫలితంగా నేడు పుష్కర స్నానాలు చేయనున్న భక్తుల సంఖ్య భారీగానే ఉండే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే, విజయవాడ పరిధిలో ఏర్పాటు చేసిన పున్నమి ఘాట్ కు నేడు పలువురు ప్రముఖులు తరలిరానున్నారు. ఇప్పటికే ఘాట్ కు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుష్కర స్నానమాచరించారు. ఇక మరికాసేపట్లో విజయవాడ రానున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా పున్నమి ఘాట్ లో పుష్కర స్నానమాచరించనున్నారు. అనంతరం ఆయన ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు.

More Telugu News