: పతకాల సాధనలో అమెరికా, చైనాల దరికి భారత్ చేరకపోవడానికి కారణం ఇదే: అక్షయ్ కుమార్

ఒలింపిక్స్ వంటి పోటీల్లో అమెరికా, చైనాలదే అగ్రస్థానం. పతకాల సాధనలో ఈ రెండు దేశాల క్రీడాకారులు చూపే ధైర్యసాహసాలు, పోరాట పటిమ భారత క్రీడాకారుల్లో కనబడదని సగటు అభిమాని ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు. అయితే ఆ దేశాలు అగ్రస్థాయిలో, భారత్ అట్టడుగు స్ధాయిలో నిలవడానికి కారణాలను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వెల్లడించాడు. ఏదైనా పతకం లేదా సర్టిఫికేట్ సాధించడం అన్నది గొప్ప విషయమని చెప్పాడు. అయితే అవి సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలేవి? అని ప్రశ్నించాడు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే పతకం కంటే డబ్బే ప్రధానమని చెప్పాడు. డబ్బు లేకపోవడం వల్లే పలువురు ఆటగాళ్లు పతకాలు కూడా అమ్ముకునే పరిస్థితి తలెత్తుతోందని అక్షయ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితి బాగుంటే వారిలో మరింత ఉత్తేజం కలుగుతుందని అక్షయ్ చెప్పాడు. డబ్బు లేకపోవడం వల్ల వారికి మెరుగైన సౌకర్యాలు అందవని, దీంతో ఏ సౌకర్యాలు కల్పిస్తే వాటితోనే సర్దుకుపోవాల్సి ఉంటుందని, అలాంటప్పుడు మెరుగైన ప్రదర్శన కావాలంటే సాధ్యం కాదని పేర్కొన్నాడు. క్రీడాకారులకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందని అక్షయ్ కుమార్ తెలిపాడు.

More Telugu News