: మోదీ అండ చూసుకుని స్వాతంత్ర్యం కోసం స్వరం పెంచిన బెలూచ్ నేతలు!

బెలూచిస్థాన్ కు స్వాతంత్ర్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తున్నానని, అందుకు ఇండియా తనవంతు సహకారాన్ని అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ, ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన వేళ, మోదీ అండతో బెలూచ్ నేతలు తమ స్వరాన్ని పెంచారు. మోదీ మద్దతుకు కృతజ్ఞతలు చెబుతూనే, స్వాతంత్ర్యం ఇచ్చేలా పాక్ ను ఒప్పించాలని అమెరికా, యూరప్ లను బాలూచ్ నేషనల్ మూవ్ మెంట్ చైర్మన్ ఖలీల్ బాలోచ్ కోరారు. తమ ప్రాంతంలో జరుగుతున్న నేరాలకు పాక్ దే బాధ్యతని, తమ స్వాతంత్ర్యం కోసం గడచిన 68 సంవత్సరాల వ్యవధిలో ఇప్పటికే పాక్ తో ఐదు యుద్ధాలను చేశామని ఆయన అన్నారు. భారత ప్రధాని తమకు మద్దతివ్వడంతో తమ చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా కీలక అడుగు పడినట్టు భావిస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం, భారతీయులు, మీడియా తమ స్వాతంత్ర్యోద్యమానికి మద్దతిస్తున్నందుకు ఎంతో రుణపడి వుంటామని బాలోచ్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు బ్రహుమ్దాగ్ బుగ్తీ ఓ వీడియో ప్రకటనలో తెలిపారు. భారత మద్దతుతో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళతామని ఆయన అన్నారు.

More Telugu News