: వెండి మిలమిల... ఏడు నెలల్లో సెన్సెక్స్ తో పోలిస్తే ఐదు రెట్లు, బంగారంతో పోలిస్తే రెట్టింపు లాభాన్నిచ్చిన వెండి!

ఈ సంవత్సరం ఆరంభం నుంచి వెండి మిలమిలా మెరుస్తోంది. స్టాక్ మార్కెట్, బంగారం ఇచ్చిన లాభాలను మించి వెండిలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలను అందుకున్నారు. జనవరి 1వ తేదీతో పోలిస్తే, ప్రస్తుతం బంగారం ధర 22.29 శాతం పెరుగగా, వెండి ధర ఏకంగా 40.69 శాతం పెరిగింది. ఇదే సమయంలో సెన్సెక్స్ -30 వృద్ధి కేవలం 7.79 శాతమే. తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు, బ్రిటన్, చైనా ఆర్థిక వ్యవస్థలపై వచ్చిన వార్తలతో మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఈ ఏడున్నర నెలల కాలంలో ఒడిదుడుకుల మధ్యే సాగింది. డిసెంబర్ 31న రూ. 25,390గా ఉన్న పది గ్రాముల బంగారం ధర గత వారాంతానికి రూ. 31,050కి చేరగా, ఇదే సమయంలో వెండి ధర కిలోకు రూ. 33,300 నుంచి రూ. 46,850కి చేరింది. గడచిన 15 సంవత్సరాల్లో పన్నెండేళ్లు బంగారం, వెండి లోహాలు లాభాల్లో నిలిచాయి. 2013లో విలువైన లోహాల ధరలు తగ్గగా, ఆపై వరుస మూడేళ్లూ లాభాలను అందించాయి.

More Telugu News