: రియోలో భారత అథ్లెటిక్స్ కోచ్ పై లైంగికారోపణలు... అరెస్ట్

భారత అథ్లెటిక్స్ క్రీడాకారులకు దీర్ఘకాలంగా సేవలందిస్తున్న కోచ్ నికోలాయ్ స్నెసరేవ్ పై, ఓ మహిళా డాక్టర్ లైంగికారోపణల ఫిర్యాదు చేయడంతో బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. లలితా బాబర్, సుధా సింగ్, ఓపీ జైషా వంటి వారికి కోచింగ్ ఇచ్చిన నికోలాయ్ ని రియో స్థానిక పోలీసు స్టేషన్లో నిర్బంధించగా, ఆపై బ్రెజిల్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు కల్పించున్నారు. దాదాపు 12 గంటల పాటు విచారించిన అనంతరం నికోలాయ్ ని విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని భారత జట్టుతో పాటు రియోలో ఉన్న అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి సీకే వాల్సన్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఎలాంటి సమస్యా లేదని, ఆయనపై ఎలాంటి కేసూ లేదని అన్నారు. ఓపీ జైషా మారధాన్ పోటీలో పాల్గొన్న అనంతరం, డీహైడ్రేషన్ కు గురి కాగా, ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లిన వేళ, భాష కారణంగా సమస్య వచ్చిందని అన్నారు. అక్కడి లేడీ డాక్టర్ నికోలాయ్ ని లోనికి రానిచ్చేందుకు అంగీకరించ లేదని, ఆ సమయంలో జరిగిన వాగ్వాదంలో మహిళా డాక్టర్ ను వెనక్కు నెట్టిన నికోలాయ్, లోనికి వెళ్లాడని, అంతకు మించి మరేమీ జరగలేదని తాము విచారిస్తున్న పోలీసులను కన్విన్స్ చేశామని తెలిపారు.

More Telugu News