: 'ఇండియాలో ఇండియన్ గా తొలి బర్త్ డే' అంటూ అద్నాన్ సమీ సంబరాలు

నేడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న గాయకుడు అద్నాన్ సమీ, భారతీయుడిగా తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్నానని ఆనందంగా చెబుతున్నాడు. పాక్ కు చెందిన సమీకి ఈ సంవత్సరం జనవరి 1న భారత పౌరసత్వం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "ఇండియాలో భారతీయుడిగా తొలి పుట్టినరోజు జరుపుకోవడం గర్వంగా ఉంది. హ్యాపీ ఇండిపెన్డెన్స్ డే" అంటూ ట్వీట్ చేశాడు. ఇక పలువురు సెలబ్రిటీలు, బాలీవుడ్ ప్రముఖులు సమీకి బర్త్ డే విషస్ చెప్పారు.

More Telugu News