: చూశారా? నష్టాల్లోని ఎయిర్ ఇండియాను లాభాల్లోకి తెచ్చాం: నరేంద్ర మోదీ

ఎప్పుడూ భారీ నష్టాలను నమోదు చేస్తుండే ఎయిర్ ఇండియా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 100 నుంచి రూ. 110 కోట్ల నిర్వహణా లాభాన్ని ఆర్జించినట్టు ఎయిర్ లైన్స్ రంగ నిపుణులు అంచనాలు వేస్తున్న వేళ, నరేంద్ర మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. "నష్టాలు తెచ్చుకునే సంస్థగా ఎయిర్ ఇండియాకు ఎంతో పేరుంది. నా ప్రభుత్వం వచ్చిన తరువాత సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చాము" అని ఆయన అన్నారు. ఎయిర్ ఇండియా ఎంత లాభాన్ని నమోదు చేసిందన్న విషయం ఇంకా అధికారికంగా వెల్లడి కానప్పటికీ, రూ. 100 కోట్లకు పైగా లాభం నమోదైనట్టు తెలుస్తోంది. కాగా, తగ్గిన విమాన ఇంధన ధరలే సంస్థను లాభాల్లోకి నడిపించినట్టు తెలుస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 30 వేల కోట్ల కేంద్ర ఉద్దీపన ప్యాకేజీ కోసం ఎదురుచూస్తూ, కొత్త సంవత్సరంలోకి వచ్చిన తరువాత ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో సీట్ ఫ్యాక్టర్ పెరగడం, తగ్గిన ఫ్యూయల్ కారణాలతో లాభాల్లోకి వచ్చింది.

More Telugu News