: క్యాంపస్ ప్లేస్ మెంట్లు చేయకుండా 20 కంపెనీలపై ఐఐటీల నిషేధం!

క్యాంపస్ ప్లేస్ మెంట్లు నిర్వహించి, ఆపై ఆఫర్ లెటర్లు ఇచ్చి విద్యార్థుల్లో ఆశలు పెంచి, ఆపై నియామకపు తేదీలను వాయిదా వేయడం, ఆఫర్ లెటర్లను ఉపసంహరించుకోవడం వంటి చర్యలతో ఇబ్బందులు పెడుతున్న స్టార్టప్, ఈ-కామర్స్ కంపెనీలపై నిషేధం పడనుంది. ఈ మేరకు ఇండియాలోని ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల సంయుక్త కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇచ్చిన ఆఫర్ లెటర్లను వెనక్కు తీసుకోవడం, ముందు ఇస్తామన్న వేతనాలను తగ్గించడం వంటి పనులతో టెక్కీలకు మనస్తాపం కలిగిస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించిన ఐఐటీ యాజమాన్యాలు బ్లాక్ లిస్ట్ జాబితాను ఏకగ్రీవంగా ఆమోదించాయి. కాగా, ఈ జాబితా ఇంకా విడుదల కానప్పటికీ, జుమోటో కంపెనీ ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం ఫ్లిప్ కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు సైతం, నెలల కొద్దీ నియామకాలను ఆలస్యం చేసి, ఆపై జాబ్ ఆఫర్లను వెనక్కు తీసుకోవడంపై హెచ్చరిక లేఖను పంపనున్నట్టు సమాచారం. ఐఐటీ కమిటీల సమావేశానికి బాంబే ఐఐటీ మినహా మిగతా అన్ని ఐఐటీలూ హాజరయ్యాయని ఏఐపీసీ కన్వీనర్ కౌస్తుబా మొహంతి వెల్లడించారు.

More Telugu News