ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఉదయం బీటెక్ స్టూడెంట్.. రాత్రయితే చైన్ స్నాచర్: ఎలా తప్పించుకోవాలో నేర్పిన హాలీవుడ్ సినిమాలు!

Mon, Aug 15, 2016, 07:28 AM
వారిద్దరూ మంచి స్నేహితులు. పేర్లు సచిన్, నసీరుద్దీన్. సచిన్ ఢిల్లీలోని ప్రముఖ యూనివర్సిటీలో బీటెక్ చదువుతుండగా నసీరుద్దీన్ చార్టెడ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలని కోరుకుంటున్నాడు. బయటకు విద్యార్థుల్లా హుందాగా కనిపించే వీరు రాత్రయితే భయంకరమైన స్నాచర్లుగా మారిపోతారు. పోలీసుకు పట్టుబడకుండా ఎలా తప్పించుకోవాలో హాలీవుడ్ సినిమాలను చూసి నేర్చుకున్నారు. వీరికి తోడుగా వివేక్ అనే మరో స్నేహితుడు ఉన్నాడు.

ట్యూషన్ పేరుతో ఇంట్లోంచి బయటకు వచ్చే సచిన్, నసీరుద్దీన్‌లు స్కూటర్ దొంగిలించి ‘వేట’ మొదలెడతారు. వివేక్ వీరికి ‘లక్ష్యాన్ని’ చూపిస్తాడు. అంతే, అయితే ఖరీదైన సెల్‌పోన్, లేదంటే మహిళల మెడలోని గొలుసులు వీరి చేతుల్లోకి వచ్చిపడతాయి. దోచుకున్న అనంతరం వ్యతిరేక దిశలో తిరిగి అదే రూట్‌లో వెళ్లిపోతారు. పొరపాటున ఎవరిచేతికైనా దొరికితే వివేక్ సీన్‌లోకి ఎంటరై స్థానికుడిలా మాట్లాడి వారికి బుద్ధి చెప్పినట్టు నటిస్తాడు. నీతులు చెప్పి అక్కడి నుంచి క్షేమంగా వారిని పంపించివేస్తాడు.

తర్వాత దోచుకున్న వాటిని వాట్సాప్‌లో పెట్టి అమ్మేస్తారు. డీల్ మొత్తం ఫోన్‌లోనే. అయితే పాపం పండిన వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. హాలీవుడ్ సినిమాలు ఈసారి వారిని రక్షించలేకపోయాయి. అరెస్ట్ అనంతరం సోదాల కోసం వారి ఇళ్లకు వెళ్లిన పోలీసులకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. విద్యార్థులను పట్టుకుని దొంగలంటున్నారని పోలీసులను అడ్డుకున్నారు. అయితే నిందితుల నోటితోనే నిజం చెప్పించడంతో వారి నిజస్వరూపం తల్లిదండ్రులకు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వివేక్ కోసం గాలిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Articles (Latest)
Articles (Education)
Top Stories (English)

Warning: mysql_fetch_array() expects parameter 1 to be resource, boolean given in /home/srirama/public_html/ap7am-nf/english-news-nf/ap7am-enews-top-stories-sidewidget-10l.php on line 8