: ఆటగాళ్ల లక్ష్యం పతకమే... రాలేదని ఎవరినీ నిందించొద్దు: రియో ప్లేయర్స్ ను వెనకేసుకొచ్చిన కోహ్లీ

ఒలింపిక్స్ వంటి పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయమని, వారు ఆ ఘనతను సాధించేందుకే ఎంతో కష్టపడి ఉంటారని భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. వారు పతకాలు సాధించలేదన్న భాధతో విమర్శిస్తూ, ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్న వేళ, వారికి మద్దతుగా నిలిచి వెనకేసుకొచ్చాడు. అథ్లెట్లను, ఆటగాళ్లను చులకన చేసి మాట్లాడటాన్ని దయచేసి ఆపాలని, ప్లేయర్లను అవమానించవద్దని సూచించాడు. ఇండియా కోసం ఆడుతున్న వారిని గౌరవించాలని చెప్పాడు. పతకం సాధించాలన్నదే వారి ఆశయమని, ఆ వేటలో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్ల గొప్పదనాన్ని మరువరాదని అన్నాడు. ఇంకా బరిలో నిలిచివున్న వారు గెలవాలని కోరుకోవాలని భారత క్రీడాభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

More Telugu News